Mulayam Singh Yadav : అత్యవసర సమయంలో కీలక సైనికుడు
ములాయం సింగ్ యాదవ్ కు పీఎం నివాళి
Mulayam Singh Yadav : దేశం రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయింది. యూపీ రాష్ట్రానికి చెందిన రాజకీయ దురంధరుడిగా పేరొందిన 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఇవాళ కన్ను మూశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో కీలక సైనికుడిగా ములాయం సింగ్ యాదవ్ పని చేశారంటూ కితాబు ఇచ్చారు. ఆయన లేక పోవడం దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా యుపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) మృతికి సంతాప సూచకంగా మూడు రోజుల పాటు అధికారికంగా సంతాప దినాలు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛానాలతో నిర్వహిస్తామని స్పష్టం చేశారు సీఎం.
రక్షణ శాఖ మంత్రిగా బలమైన భారత దేశం కోసం పని చేశారంటూ కితాబు ఇచ్చారు ప్రధాని మోదీ. ప్రజల కోసం పని చేశారని జయప్రకాశ్ నారాయణ్ , రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చేందుకు తన జీవతాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది మర్ము కీలక ప్రకటన చేశారు.
సాధారణ జీవితం నుంచి వచ్చిన ములాయం అసాధారణ నేతగా ఎదిగారని కొనియాడారు. ఆయన మరణం యుగాంతం అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. సర్వ శక్తి మంతుడు ములాయం సింగ్ యాదవ్ అని కొనియాడారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ములాయం సింగ్ యాదవ్ లేక పోవడం బాధాకరమన్నారు ఒమర్ అబ్దుల్లా.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి గొప్పదన్నారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రముఖ పాత్ర పోషించారంటూ కితాబు ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఒక శకం ముగిసిందన్నారు ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.
Also Read : ములాయం సోషలిజం మూల స్తంభం – యోగి