Deshmukh Malik : దేశ్ ముఖ్..మాలిక్ కు బిగ్ షాక్

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు నో

Deshmukh Malik : మ‌హారాష్ట్ర‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల‌లో 57 సీట్ల‌కు ఎన్నిక‌లకు గాను నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దింపాయి.

ఇదిలా ఉండ‌గా మొత్తం 41 ఎంపీ సీట్లు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇంకా మిగిలి పోయిన 16 సీట్ల కోసం గ‌ట్టి పోటీ నెల‌కొంది. ఈ త‌రుణంలో రాజ‌స్థాన్ లో మీడియా బ్యారెన్ గా పేరొందిన జీ గ్రూప్ ఎస్సెల్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ సుభాష్ చంద్ర బ‌రిలో ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక మ‌హారాష్ట్ర విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ గ‌ట్టి పోటీ నెల‌కొంది. ఈ త‌రుణంలో ఇప్ప‌టికే మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో మ‌హా వికాస్ అగాఢీ కూట‌మిలో మంత్రులుగా ఉన్న న‌వాబ్ మాలిక్ , అనిల్ దేశ్ ముఖ్ జైలులోనే ఉన్నారు.

వారిద్ద‌రూ త‌మ‌కు ఓటు వేసేందుకు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని ముంబై కోర్టును ఆశ్ర‌యించారు. వీరి అభ్య‌ర్థన‌ను కోర్టు బేష‌ర‌తుగా తిర‌స్క‌రించింది. వారు ఓటు వేసేందుకు అర్హులు కారంటూ పేర్కొంది.

అందుకే బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రిస్తున్న‌ట్టు తీర్పు చెప్పింది. ఈ ఇద్ద‌రూ పీఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. దేశ్ ముఖ్ ఆర్త‌ర్ రోడ్ జైలు లో ఉన్నారు.

కాగా మాలిక్ అనారోగ్య కార‌ణాల రీత్యా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 10న శుక్ర‌వారం రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

అప్ప‌టి ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అనిల్ దేశ్ ముఖ్(Deshmukh Malik) పై. ప్ర‌తి నెలా మామూళ్లు వ‌సూలు చేయాల‌ని ఆదేశించారంటూ తెలిపారు.

దీంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇదే స‌మ‌యంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం అనుచ‌ర‌ల‌తో సంబంధాలు ఉన్నాయంటూ మాలిక్ ను అరెస్ట్ చేసింది ఈడీ.

Also Read : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!