Elon Musk Warning : ట్విట్టర్ యూజర్లకు మస్క్ వార్నింగ్
గతంలో లాగా యూజ్ చేయడం కష్టం
Elon Musk Warning : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ మరోసారి షాక్ ఇచ్చారు. రోజు రోజుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో పని చేస్తున్న 7,500 మందిలో సగానికి పైగా జాబర్స్ ను తొలగించారు ట్విట్టర్ బాస్. ఇప్పటికే బ్లూ టిక్ కు సంబంధించి ఇక నుంచి $8 డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు.
వచ్చే నెల లోపు ఇండియాలో ప్రవేశ పెడతామని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు. గతంలో ఆయా ఖాతాలకు సంబంధించి ఖాతాల జప్తు, నిలిపి వేయడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కుదరదని స్పష్టం చేసింది ట్విట్టర్. ఈ మేరకు సంస్థ బాస్ ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు(Elon Musk Warning).
పేరుకు సంబంధంచి డిస్ ప్లే మార్పు, చేర్పులు చేసినా బ్లూ టిక్ ను కోల్పోతారంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు కొనుగలు చేశాడు ఎలాన్ మస్క్. దానిని తీసుకున్న వెంటనే టాప్ ఎగ్జిక్యూటివ్ లు సిఇఓ పరాగ్ అగర్వాల్ , సిఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దెతో పాటు కీలక పోస్టులలో ఉన్న వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించాడు ట్విట్టర్ బాస్.
ఇప్పటి వరకు ట్విట్టర్ కు సంబంధించిన కార్యాయాలను మూసి ఉంచడం కూడా కీలకంగా మారింది. ప్రధానంగా మైక్రో బ్లాగింగ్ సంస్థను ఆదాయ మార్గంలోకి మళ్లించాలని ప్రయత్నాలు ప్రారంభించారు ఎలాన్ మస్క్. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.
Also Read : ట్విట్టర్ కు ధీటుగా జాక్ డోర్సే ప్లాన్