Arvind Kejriwal : ఇవాళ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ ఊహించని రీతిలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఎక్కడా డబ్బుల్ని పంచలేదు. ఎవరినీ దూషించ లేదు పైపెచ్చు వ్యక్తిగత విమర్శలకు దిగలేదు.
కానీ అసాధారణమైన రీతిలో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసేలా చేశారు. ఆపై పంజాబ్ మోడల్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వమని, ఏది చేస్తామో అదే చెపుతామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఈ సందర్భంగా ఆయన కొత్త చరిత్రకు నాంది పలికారు.
అన్ని పార్టీలలో సంప్రదాయ బద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాష్ట్రానికి సంబంధించి సీఎంను ఎన్నుకున్నారు. కానీ ఆ పార్టీలకు భిన్నంగా ఆయన రాష్ట్ర ప్రజల నుంచి విన్నపాన్ని స్వీకరించారు.
ఆప్ నుంచి మీకు సీఎంగా ఎవరు ఉండాలని భావిస్తారో చెప్పండి అంటూ పోల్ సర్వే చేపట్టారు. టెలిఫోన్, మొబైల్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించారు.
చివరకు పంజాబ్ సీఎం ఆప్ అభ్యర్థిగా భగవంత్ మాన్ ను ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఇవాళ ఆప్ అఖండ విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది.
ఈ తరుణంలో సీఎం భగవంత్ మాన్ మర్యాద పూర్వకంగా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ను కలుసుకున్నారు ఆయన నివాసంలో. ఈ సందర్భంగా భగత్ సింగ్ పుట్టిన ఊరులో జరిగే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు.
ఇదే సమయంలో డిప్యూటీ సీఎం సిసోడియాను కూడా కలుసుకున్నారు. ఇదిలా ఉండగా నా సోదరుడు పంజాబ్ ప్రజల ఆశలను నెరవేరుస్తాడంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కేజ్రీవాల్.
Also Read : నా సోదరుడు ప్రజల ఆశల్ని తీరుస్తాడు