Raj Mohan Gandhi : నెహ్రూపై అపోహలు అవాస్తవం – గాంధీ
మహాత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్
Raj Mohan Gandhi : జాతిపిత మహాత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ(Raj Mohan Gandhi ) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నరేంద్ర మోదీ ప్రధానిగా కొలువు తీరాక దేశంలో నెహ్రూ, గాంధీ, అంబేద్కర్, కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.
నెహ్రూను పదే పదే తక్కువ చేసి మాట్లాడటం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. గాంధీ విషయంలో కూడా ఇలాగే కొనసాగుతుండడంపై జాతిపిత మనుమడు రాజ్ మోహన్ గాంధీ స్పందించారు. తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ, నెహ్రూ , విభజన , సమకాలీన భారత దేశం గురించి టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ అమాయకుడు కాదు. అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడని చరిత్రకారుడైన రాజ్ మోహన్ గాంధీ తెలిపారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను చూసి హిమాలయాలు కూడా సిగ్గు పడతాయని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశలోని కసౌలీ లోని ఖుశ్వంత్ సింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు రాజ్ మోహన్ గాంధీ.
మీరు నెహ్రూ విధానాలను విమర్శించవచ్చు. కానీ ఒక గొప్ప వ్యక్తి గురించి నీచమైన అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా మరింత దిగజారకండి అంటూ హెచ్చరించారు. విధానాలను విమర్శించడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తప్పుడు కథనాలు ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు.
నెహ్రూకి హిమాలయాలు అంటే ఇష్టం. అవి కూడా తల వంచుకుంటాయి. భూమి కూడా ఒప్పుకోదన్నారు రాజ్ మోహన్ గాంధీ. గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మహోన్నత మానవుడని కీర్తించారు.
Also Read : దాదా పనితీరుపై విమర్శలు సరికాదు – ధుమాల్