N Biren Singh : సుదీర్ఘ చర్చల అనంతరం భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) హై కమాండ్ మరోసారి ఛాన్స్ ఇచ్చింది ఎన్. బీరేన్ సింగ్(N Biren Singh ). ఇవాళ మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి సహకారం లేకుండానే బీజేపీ సీట్లు గెలుచుకుంది. ఇదిలా ఉండగా 60 స్థానాలు ఉండగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) 32 సీట్లు కైవసం చేసుకుంది.
ఆదివారం జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో బీరేన్ సింగ్ ను సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో బీరేన్ సింగ్ (N Biren Singh )రెండో సారి మణిపూర్ కు ముఖ్యమంత్రి గా కొలువు తీరారు.
ఆయనతో పాటు మరో ఐదుగురు శాసన సభ్యులు మంత్రులుగా పని చేశారు. నాలుగు రాష్ట్రాలలో బీజేపీ కాషాయ జెండా ఎగుర వేసింది.
కానీ మణిపూర్ విషయంలో సీఎం ఎంపిక ఆలస్యం అయింది. ఉత్కంఠ నెలకొంది. బీరేన్ సింగ్ తో పాటు బిస్వజిత్ తో పాటు మాజీ స్పీకర్ కూడా సీఎం రేసులో ఉన్నారు.
చివరకు ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్. బీరేన్ సింగ్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం కొలువు తీరిన బీరేన్ సింగ్ జవాన్ గా, జర్నలిస్ట్ గా పని చేశారు.
ఆయనతో పాటు కీప్ జెన్ , కేమ్ చాంద్ సింగ్ , బిశ్వ జిత్ సింగ్ , నెవ్ మాయి, గోవింద దాస్ లు కొలువు తీరారు. ఇదిలా ఉండగా బీరేన్ సింగ్ 18 వేల ఓట్లతో విజయం సాధించారు.
Also Read : దైవభూమిలో ఓడినా ధామికే పట్టం