N Raghuveera Reddy : రాహుల్ యాత్రలో రఘువీరా రెడ్డి
అగ్ర నేతకు శేషవస్త్రం బహూకరణ
N Raghuveera Reddy : కాంగ్రెస్ పార్టీలో ఆయన సుదీర్ఘమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎంత సంపాదించినా చివరకు సాధారణంగా బతకడమే మేలని స్వంత ఊరులోనే గడుపుతున్నారు.
కేవలం సర్పంచ్ అయితే చాలు హంగు ఆర్భాటం ప్రదర్శించే నాయకులు ఉన్న ఈ తరుణంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి అందుకు భిన్నంగా ఉంటూ ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు.
తన ఊరులో దేవాలయాన్ని అభివృద్ది చేసి ఊరికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం నీలకంఠాపురం అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సైతం ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడికి రఘువీరారెడ్డిని అభిమానించే వారు, ప్రేమించే వారు తాను పని చేసిన సమయంలో తనతో పనులు చేయించుకున్న వాళ్లు తన వద్దకు వస్తుండడంతో ఇదే చాలంటున్నారు రఘువీరారెడ్డి(N Raghuveera Reddy).
ఆయనతో పరిచయం కలిగిన వారు ఎవరైనా సరే ఒక్కసారి కలిస్తే ఇక ప్రతిసారి కలవాలని అనుకుంటారు. తన కోసం వచ్చిన వారు ఎవరైనా సరే ఆప్యాయంగా పిలుస్తారు. ఆపై మరిచి పోలేని ఆతిథ్యం ఇస్తారు. కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు. ఇది ఆయనకు ఉన్న ప్రత్యేకత. అందుకే రాజకీయాలకు అతీతంగా రఘువీరా రెడ్డి అంటే ఎంతో గౌరవిస్తారు. అభిమానంగా చూస్తారు.
తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో యాత్ర చేపట్టారు. నీలకంఠాపురం కు చేరుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ వెంట నడిచారు ఎన్ . రఘువీరారెడ్డి.
ఇందులో భాగంగా నీలకంఠాపురం ఆలయం తరపున శేష వస్త్రం సమర్పించారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Also Read : మోదీ పాలనలో దిగజారిన భారత్ ర్యాంకు