Naatu Naatu Oscar 2023 : నాటు నాటు పాట‌కు ఆస్కార్

తెలుగు పాట‌కు ద‌క్కిన గౌర‌వం

Naatu Naatu Oscar 2023 : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటు పాటుకు ఆస్కార్ బెస్ట్ ఒరిజన‌ల్ సాంగ్ 2023(Naatu Naatu Oscar 2023) ద‌క్కించుకుంది. ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాస్తే , రాహుల్ సిప్లిగంజ్ , కాల భైర‌వ ప్రాణం పెట్టి పాడారు. ఎంఎం కీర‌వాణి సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా నాటు నాటు సాంగ్ దుమ్ము రేపింది. ప్ర‌పంచ సినీ రంగంపై తెలుగువాడి ద‌మ్ము ఏమిటో ఒక్క‌సారి చూపించారు ద‌ర్శ‌క ధీరుడు.

ఇప్ప‌టికే షార్ట్ ఫిలిం కేట‌గిరీలో భార‌త్ కు చెందిన ది ఎలిఫెంట్ విష్ప‌ర‌ర్స్ కు ద‌క్కితే రెండో పుర‌స్కారం రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ పాట‌కు ల‌భించింది. దీంతో యావ‌త్ భార‌త దేశం సంబురాల్లో మునిగి పోయింది. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి అభినంద‌నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాట‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ న‌టించారు.

భార‌త దేశం నుంచి మూడు నామినేట్ అయ్యాయి. మూడ‌వ నామినీ షౌన‌క్ సేన్ ఆల్ దట్ బ్రీత్స్ ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫిల్మ్ కోసం ఆస్కార్ ను కోల్పోయింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ ఈ పాట‌ను రాసేందుకు శ్ర‌మించారు. ఈ వేడుక‌లో మొదటి ఆస్కార్ ఉత్త‌మ యానిమేటెడ్ ఫీచ‌ర్ ఫిల్మ్ గా గిల్లెర్మో డెల్ టోరో ద‌క్కించుకుంది. ఎవ్రీ వేర్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వ‌న్స్ రాత్రికి రాత్రే రెండు అవార్డుల‌ను ద‌క్కించుకుంది.

ఆస్కార్ ల‌ను జిమ్మీ కిమ్మెల్ మూడోసారి హోస్ట్ చేస్తున్నారు. ఇక నాటు నాటు పాట గురించి దీపికా ప‌దుకొణే ప‌రిచ‌యం చేశారు.

Also Read : విశ్వ వేదిక‌పై నాటు నాటు అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!