Naatu Naatu Song Comment : విశ్వ వేదికపై ‘నాటు’ సంతకం
తెలుగు పాటకు దక్కిన గౌరవం
Naatu Naatu Song Comment : యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూసింది. అంతా ఊహించినట్టు గానే జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి చెందిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు ఎంపికైంది. ఇది సమిష్టి కృషి ఫలితం. గతంలో ఎందరో తమ తమ రంగాలలో ప్రతిభను చూపారు. కానీ ఇంతలా ప్రాచుర్యం పొందలేదు. అల్లా రఖా రహమాన్ కు ఆస్కార్ దక్కినప్పుడు ఆనంద పడ్డాం.
ఇవాళ తెలుగు సినిమా గర్వంగా తల ఎత్తుకునేలా చేశాడు దర్శక ధీరుడు జక్కన్న. హాలీవుడ్ స్థాయిలో ఉండేలా తీసేందుకు ఎక్కువగా కష్టపడటమే అతడిని ప్రత్యేకంగా ఎంచుకునేలా చేసింది.
ఇది పక్కన పెడితే జక్కన్న తీసే ప్రతి సినిమాలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉంటుంది. గుండెల్ని పిండేసే మాటలే కాదు హృదయ లోతుల్లో మిగిలి పోయిన కన్నీళ్లను కూడా తడిమే పాటలు ఉంటాయి. తెలంగాణ సంస్కృతిని , తెలుగు వారి అభిరుచిని కలిపి రాసిన పాటే నాటు నాటు సాంగ్(Naatu Naatu Song Comment).
ఇప్పటికే ఎన్నో వైవిధ్య భరితమైన పాటలకు పెట్టింది పేరు గేయ రచయిత చంద్రబోస్. ఆర్ఆర్ఆర్ లో సుద్దాల అశోక్ తేజ రాసిన మరో పాట కొమురం భీముడో అన్న పాట హైలెట్. కానీ యావత్ లోకాన్ని మాత్రం ఎక్కువగా ఆకట్టుకుంది మాత్రం నాటు నాటు సాంగ్.
ఆర్ఆర్ఆర్ మూవీకి ఈ పాట ముందు నుంచి హైలెట్ గా నిలుస్తూ వచ్చింది. విడుదలయ్యాక కోట్లు కొల్లగొట్టింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ మార్కెట్ లో తామేమీ తీసిపోమంటూ చాటి చెప్పేలా చేసింది ఆర్ఆర్ఆర్. ఇక ప్రతి సినిమా వెనుక కమర్షియల్ కోణం ఉంటుంది.
ఇది ఇద్దరి వీరుల కథ. ఒకరు అల్లూరి సీతారామరాజు. మరొకరు కొమురం భీం. కథల్ని ఎంచు కోవడంలోనే ఎక్కువగా ఫోకస్ పెడతారు రాజమౌళి. ఆయన టేకింగ్ , మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక నాటు నాటు ఇంతలా పాపులర్ కావడానికి కారణం జక్కన్నే. దీనిని రాసేందుకు తాను నెల రోజుల పాటు కష్ట పడ్డానని చెప్పాడు చంద్రబోస్.
ఇక సినీ రంగానికి చెందిన ఏ టెక్నీషియనైనా అంతిమంగా తనకు ఆస్కార్ వస్తే బావుంటుందని కలలో అనుకుంటాడు. కానీ అది నిజం చేసి చూపించాడు రాజమౌళి. బాహుబళి తర్వాత జక్కన్న అందనంత ఎత్తుకు ఎదిగాడు.
ఒక రకంగా తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఆయనకు తెలిసినంత ఇంకెవరికీ తెలియదు. భారీ ఎత్తున ఖర్చు పెట్టారని బయట ప్రచారం జరుగుతున్నా నాటు నాటు సాంగ్ కు(Naatu Naatu Song) ఆస్కార్ రావడంతో దాని ముందు అదో లెక్కే కాదు.
ఇక పాటలకు ప్రాణం పోయడంలో , వాటిని పది కాలాల పాటు పాడుకునేలా చేయడంలో కీరవాణి వెరీ స్పెషల్. రాహుల్ సిప్లిగంజ్ ..కాల భైరవ పాడగా జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరిని కదిలించేలా చేశాయి.
ఒక రకంగా తెలుగుదనం కరువై పోతున్న ప్రస్తుత తరుణంలో తెలుగు వారికి గర్వ కారణంగా నిలిచేలా విశ్వ వేదికపై ఆర్ఆర్ఆర్ తో గుర్తింపు తీసుకు వచ్చినందుకు జక్కన్నను అభినందించాలి.
రాబోయే రోజుల్లో ఆయనపై భారీగా అంచనాలు పెరుగుతాయి. నాటు నాటు సాంగ్ ఎన్నికైనందుకు..వెండి తెర పై చెరగని సంతకం చేసినందుకు ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు.
Also Read : భారత దేశానికి దక్కిన గౌరవం