Naatu Naatu Song : సినీ లోకంపై తెలుగు పాట సంతకం
జక్కన్నకు అభినందనల వెల్లువ
Naatu Naatu Song Oscar : యావత్ సంగీత ప్రపంచం విస్తు పోయేలా తెలుగు వాడి పాటకు గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడెమీ 2023 అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పరిచయం చేసింది నాటు నాటు(Naatu Naatu Song Oscar) సాంగ్ ను. తెలుగు వారి గుండె చప్పుళ్లను వినిపించింది ఈ పాట. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ నాటు నాటు పాటను రాశారు. దీనిని రాసేందుకు నెల రోజుల పాటు కష్ట పడ్డారు.
ఆర్ఆర్ఆర్ మూవీకి దర్శకత్వం వహించారు ఎస్ఎస్ రాజమౌళి. దీనిని దానయ్య నిర్మించారు. గతంలో సినిమా అంటేనే బాలీవుడ్ అని పేరుండేది. కానీ జక్కన్న దానిని చెరిపి వేశాడు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాటకు స్వర పరిచారు. రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ మనసు పెట్టి పాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటను ప్రకటించింది ఆస్కార్ అవార్డ్ అకాడెమీ ప్రకటించింది.
ఈ పాటకు అద్భుతంగా నృత్యం చేశారు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్. ఇక నాటు నాటుకు అవార్డు ప్రకటించగానే అక్కడే ఉన్న రాజమౌళి, రమా రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్ , కార్తికేయ సంతోషం వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచం అంతా నాటు నాటు సాంగ్ దుమ్ము రేపింది. ఎక్కడ చూసినా నాటు నాటు సాంగ్(Naatu Naatu Song) వినిపించింది..కనిపించింది. ఒక రకంగా భారతీయ సినిమాకు దక్కిన గౌరవం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Also Read : జయహో చంద్రబోస్..కీరవాణి