Nadendla Manohar Kanna : కన్నా నాదెండ్ల భేటీపై ఉత్కంఠ
ఏపీలో కీలక పరిణామం
Nadendla Manohar Kanna : ఏపీలో ఇంకా ఎన్నికలే రాలేదు. కానీ రాజకీయాలు మాత్రం రోజు రోజుకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ గతంలో మంత్రిగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీకి సంబంధించి ఏపీ చీఫ్ గా పని చేశారు.
అనుకోని పరిస్థితుల్లో తన పదవి నుంచి తప్పుకున్నారు. కన్నా స్థానంలో సోమూ వీర్రాజుకు బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్. ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ, ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది.
ఇదే సమయంలో జనసేన పార్టీ కీలక నాయకుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడం ఉత్కంఠను రేపింది. ఒకవేళ కన్నా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో చేతులు కలుపుతారా అన్న దానిపై చర్చ జరుగుతోంది.
అయితే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాదెండ్ల మనోహర్ వచ్చారని, గతంలో పరిచయం ఉన్నందు వల్ల మర్యాద పూర్వకంగా కలిసేందుకు మాత్రమే వచ్చారని కన్నా(Nadendla Manohar Kanna) వర్గీయులు పేర్కొంటున్నారు.
కాగా ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్లే ఆలోచన ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో టీడీపీ, బీజేపీ, జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
ఇక కన్నా లక్ష్మినారాయణతో మనోహర్ ఏకాంతంగా చర్చలు జరపడం పూర్తిగా రాజకీయమేనని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు వీళ్లిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరనేది నానుడి. ఏమైనా కావచ్చు. ఏదైనా జరగవచ్చు.
Also Read : వారసత్వం అబద్దం పనితీరుకే పట్టం