Nagma Actress : కాంగ్రెస్ పార్టీపై న‌గ్మా గుస్సా

సీటు నిరాక‌రణ‌పై తీవ్ర ఆగ్ర‌హం

Nagma Actress : న‌టి న‌గ్మా దేశ వ్యాప్తంగా పేరొందారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించి రాజ్య‌స‌భ స్థానాల‌కు

సంబంధించి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. చివ‌రి దాకా న‌టి న‌గ్మా(Nagma Actress)కు సీటు ద‌క్కుతుంద‌ని భావించారు.

తీరా జాబితాలో త‌న పేరు లేక పోవ‌డంపై సీరియ‌స్ అయ్యారు. ఈ మేర‌కు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న‌కు ఏం త‌క్కువ అని

ప్ర‌శ్నించారు. సోమ‌వారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు.

తాను త‌క్కువ అర్హ‌త క‌లిగి ఉన్న‌ట్లు పార్టీ భావిస్తోందా అంటూ నిప్పులు చెరిగారు. ఎగువ స‌భ‌లో స్థానం క‌ల్పించ‌క పోవ‌డంపై న‌గ్మా తీవ్ర

అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ త‌న రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ప్ర‌క‌టించిన ఒక రోజు త‌ర్వాత స్పందించారు.

2003లో సోనియా గాంధీ కోరిక మేర‌కు పార్టీలో చేరా. ఈ రోజు వ‌ర‌కు పార్టీకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు న‌గ్మా(Nagma Actress). కానీ పార్టీ ఇలా అన్యాయం చేస్తుంద‌ని అనుకోలేదంటూ వాపోయింది.

ఇదిలా ఉండ‌గా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏడు రాష్ట్రాల నుంచి 10 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్ర‌క‌టించింది. జాబితాలో ప‌లువురు ప్ర‌ముఖ నేత‌ల పేర్లు లేక పోవ‌డంతో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.

రాజ‌స్థాన్ నుంచి ర‌ణ్ దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్ , ప్ర‌మోద్ తివారీ అభ్య‌ర్థులుగా నిలిచారు. ఈ ముగ్గురు నేత‌లు రాజ‌స్తాన్ కు

చెందిన వారు కాదు.

వీరిని ఎందుకు ఎంపిక చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే స‌న్యామ్ లోధా ప్ర‌శ్నించారు.గులాం న‌బీ ఆజాద్ , ఆనంద్ శ‌ర్మ ల పేర్లు వినిపించాయి.

కానీ వారికి చోటు ద‌క్క‌లేదు. ఇమ్రాన్ , రంజిత్ రంజ‌న్ కు చాన్స్ ఇచ్చింది పార్టీ. ప్ర‌తాప్ గ‌ర్హిని మ‌రాఠా నుంచి పోటీకి దింపారు. ఇక ఛ‌త్తీస్ గ‌ఢ్ , హ‌ర్యానా, క‌ర్ణాట‌క నుంచి రాజీవ్ శుక్లా, అజ‌య్ మాకెన్ , జైరాం ర‌మేష్ ల‌ను బ‌రిలోకి దింపింది.

ఎంపీ నుంచి తంఖాను నిలిపింది. త‌మిళ‌నాడు నుంచి పి. చిదంబ‌రం కు ఛాన్స్ ల‌భించింది.

Also Read : అపురూప చిత్రం ఒబామా జ్ఞాప‌కం

Leave A Reply

Your Email Id will not be published!