Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. గుంటూరు జిల్లా కోర్టు నందిగంకు బెయిల్ మంజూరు చేసింది. టిడిపి కార్యకర్త ఇసుక పల్లి రాజుపై దాడి కేసులో అరెస్ట్ అయిన సురేష్, ఇప్పటి వరకూ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, అతని సోదరుడు నందిగం వెంకట్ తో కలిసి ఇటీవల తన స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్తపై తీవ్ర స్థాయిలో దాడికి దిగారు. ఈ దాడిలో ఇసుకపల్లి కృష్ణ అలియాస్ రాజుని తీవ్రంగా గాయపరిచారు.
Nandigam Suresh Bail..
అంతేకాదు, తీవ్రంగా గాయపడ్డ రాజును అంతటితో వదిలేయకుండా ఇంటికి తీసుకువెళ్లి బంధించారు. ఇక, ఇంటి వద్ద సురేశ్ భార్య బేబి, తదితరులు కూడా రాజుని రాళ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీనితో రాజు భార్య చేసిన ఫిర్యాదు మేరకు నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం సురేష్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
Also Read : BJP: ఏపీ, తెలంగాణా బీజేపీ అధ్యక్షుల నియామకం
