Nandikanti Sridhar : ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్
ప్రకటించిన బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్
Nandikanti Sridhar : తెలంగాణ – తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ చైర్మన్ గా నందికంటి శ్రీధర్ నియమితులయ్యారు. శుక్రవారం భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Nandikanti Sridhar Got a Chance
పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. నందికంటి శ్రీధర్(Nandikanti Sridhar) కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. డీసీసీ చీఫ్ గా పని చేశారు. తాజాగా బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఉన్నట్టుండి ఊహించని రీతిలో రాష్ట్ర స్థాయి పోస్ట్ దక్కింది. ఇది సహాయ కేబినెట్ హోదా ఉంటుంది.
ఎంబీసీ చైర్మన్ తో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సంస్థ చైర్మన్ గా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఛాన్స్ ఇచ్చారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ భగరీథ సంస్థ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేశ్ ను నియమించారు సీఎం కేసీఆర్. మొత్తంగా నందికంటి శ్రీధర్ కు అత్యున్నత పదవి దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవలే డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసి కలకలం రేపారు. మొత్తంగా గులాబీ తీర్థం పుచ్చుకున్న శ్రీధర్ కు బిగ్ పోస్ట్ దక్కడం విశేషం.
Also Read : Muttireddy Yadagiri Reddy : ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి