Nandikanti Sridhar : కాంగ్రెస్ కు సీనియర్ నేత రిజైన్
మల్కాజ్ గిరి ప్రెసిడెంట్ గుడ్ బై
Nandikanti Sridhar : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ, నేతల చేరిక ప్రహసనంగా మారింది. ఈ జాడ్యం అన్ని పార్టీలకు చేరింది. ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన తమను కాదని బీఆర్ఎస్ కు చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావును ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు మల్కాజ్ గిరి జిల్లా పార్టీ ఇంఛార్జ్ నందికంటి శ్రీధర్.
Nandikanti Sridhar Resigned from Congress
తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మౌలాలి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వెయ్యి మందికి పైగా ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం వారి కోరిక మేరకు తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్(Nandikanti Sridhar) మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించానని, అంతకంటే అధికంగా తాను పార్టీ కోసం పని చేశానని, ఇవాళ పార్టీని బీఆర్ఎస్ కు ధీటుగా బలోపేతం చేసినా తనను టీపీసీసీ గుర్తించ లేదని వాపోయారు.
తన తల్లే తనను మోసం చేసిందంటూ నందికంటి శ్రీధర్ కంట తడి పెట్టారు. ఇదే సమయంలో మైనంపల్లి హన్మంతురావుకు ఎలా టికెట్ ఇస్తామని ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Bandaru Satyanarayana : బండారు అరెస్ట్ తో ఉద్రిక్తం