Nani vs Chinni : నాని కామెంట్స్ క‌ల‌క‌లం త‌మ్ముడికి అంద‌లం..?

టీడీపీ చీఫ్ బాబు నానికి చెక్ పెట్ట‌నున్నారా

Nani vs Chinni : తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదంటూ తెలుగుదేశం పార్టీ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు రానున్నాయి.

ఇప్ప‌టికే వైసీపీ గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసింది. ఈ త‌రుణంలో ఎంపీ చేసిన కామెంట్స్ దేనికి సంకేతమ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. బెజవాడ టీడీపీలో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాజాగా కేశినేని నాని(Nani vs Chinni) తో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన నాని సొంత పార్టీకి వ్య‌తిరేకంగా కామెంట్స్ చేశారు.

ఇటీవల విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో.. టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోనే కేశినేని నాని ఈ తరహా వ్యాఖ్యలు

చేశారని భావిస్తున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ నానికి టికెట్ ఇవ్వదని.. ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియ‌స్ చిన్ని(Nani vs Chinni)  ఎంపీగా పోటీ

చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవ‌ల ‘మహానాడు’లోనూ చిన్ని చురుగ్గా వ్యవహరించారు.

ప్ర‌ధానంగా టీడీపికి బలంగా ఉండే విజయవాడ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో.. దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్‌ మీరా

తదితర నేతలకు స్థానిక ఎంపీ నానితో పొసగడం లేదు.

అదే సమయంలో పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీలు, పార్టీ నేత‌లు కూడా ఇప్ప‌టికే కేశినేని చిన్నితో ట‌చ్‌లో ఉంటున్నారు. ఈ ప‌రిణామ‌ల నేప‌థ్యంలో ఎంపీ నాని ఒంట‌రిగా మారిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఎంపీ నాని వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న‌కి చెక్ పెట్టడం కోసం.. ఆయన తమ్ముడైన చిన్నిని పార్టీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

2014 ఎన్నికల సమయంలో తన సోదరుడికి బాసటగా నిలిచిన చిన్ని.. 2019 ఎన్నికల సమయంలో త‌న అన్న తీరు న‌చ్చ‌క‌ దూరంగా

ఉన్న‌ట్టు తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన చిన్నితో చంద్రబాబు, లోకేశ్.. కొంత‌కాలం క్రితం హైదరాబాద్‌లో మంతనాలు జరిపారని టాక్.

Also Read : అంకురాల‌కు టీ హ‌బ్ ఆలంబ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!