Naor Gilon : అదానీ గ్రూప్‌కు సత్తా ఉంది – గిలోన్
ఇజ్రాయెల్ రాయబారి మద్దతు
Naor Gilon : ప్రపంచ వ్యాప్తంగా అదానీ గ్రూప్ పై రాద్దాంతం జరుగుతుండగా , భారత దేశంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు సంస్థకు అండగా నిలిచింది ఇజ్రాయెల్. ఈ మేరకు ఆ దేశపు రాయబారి నౌర్ గిలోన్(Naor Gilon) కీలక ప్రకటన చేశారు. అదానీ గ్రూప్ కు దేనినైనా ఎదుర్కొనే సత్తా కలిగి ఉందని స్పష్టం చేశారు. గత కొన్ని తరాల నుంచి భారత్, ఇజ్రాయెల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఇజ్రాయెల్ లో భారతీయ నియంత్రణలో ఉన్న ఓడ రేవులను తాము స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. హైఫా పోర్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు తాము సానుకూలంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లో మరిన్ని ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ అన్వేషిస్తోందని ఆయన చెప్పారు.
వ్యూహాత్మకమైన హైఫా ఓడ రేవును తమ దేశం అదానీ గ్రూప్ కు అప్పగించడం భారత్ పై ఉన్న నమ్మకానికి అద్దం పడుతోందని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్(Naor Gilon) వెల్లడించారు. మా దృక్కోణం నుండి చూస్తే ఇది చాలా ముఖ్యమైన చర్య. ఎందుకంటే హైఫా పోర్ట్ మా వ్యూహాత్మక ఆస్తి. అదానీ గ్రూప్ కు హైఫా పోర్ట్ ను అవసరమైన ఓడ రేవుగా మార్చేందుకు , ఇజ్రాయెల్ , భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందన్నారు.
మాకు టాటా, కళ్యాణి, భెల్ సహా భారతీయ కంపెనీలకు దాదాపు 80 జాయింట్ వెంచర్లు ఉన్నాయని గిలోన్ చెప్పారు. అదానీ గ్రూప్ ప్రధాన వ్యాపారం పోర్ట్ లు బాగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read : యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రామస్వామి