Nara Bhuvaneswari: చంద్రబాబు భార్య భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం !
చంద్రబాబు భార్య భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం !
: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకున్న విమానం… గన్నవరం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యేందుకు రవ్ వే పైకి వచ్చి మళ్ళీ గాల్లోకి ఎగిరింది. దీనితో నారా భువనేశ్వరి సహా విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం… చివరకు సాంకేతిక లోపాన్ని సరిచేసి… సేఫ్ గా విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేసారు. దీనితో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో నిజం గెలవాలి యాత్రలో పాల్గొనడానికి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి… 20 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టడంతో… టీడీపీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే 20 నిమిషాల తరువాత విమానాన్ని సేఫ్ గా లాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Nara Bhuvaneswari- అసలు ఏం జరిగిందంటే ?
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. రెండు మార్లు ప్రయత్నించినా… వీల్ ప్యానెల్ ఓపెన్ కాకపోవడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు (ATC) సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా విషయాన్ని వివరించాడు. దీనితో విమానంలో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పి… వీల్ ప్యానెల్ ను సరి చేసాడు. అంతా ఓకే అయిన తర్వాత రెండో సారి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించాడు. ఎలాంటి ప్రమాదం జరక్కుండా క్షేమంగా దిగడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : BJP Bus Yatra: ఫిబ్రవరి 10 నుండి తెలంగాణాలో బీజేపీ బస్సు యాత్ర !