Nara Brahmani : అరెస్ట్ అక్రమం కుట్ర నిజం
నారా బ్రాహ్మణి షాకింగ్ కామెంట్స్
Nara Brahmani : హైదరాబాద్ – హెరిటేజ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మామ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరేమీ లేదన్నారు.
ఐటీ పరంగా హైదరాబాద్ ను అభివృద్ది చేసిన ఘనత తన మామకు దక్కుతుందన్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుందన్నారు. కానీ కావాలని కుట్ర పన్నారని, అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు నారా బ్రాహ్మణి.
Nara Brahmani Comments Chandrababu Arrest
చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్ర, నిర్వహించిన బహిరంగ సభలతో పాటు తన భర్త నారా లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించిందని అందుకే జగన్ ప్రభుత్వం జీర్ణించు కోలేక పోయిందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా సిమెన్స్ కంపెనీ మాజీ సిఇవో సుమన్ బోస్ అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారని ఇంతకంటే ఇంకేం కావాలని నారా బ్రాహ్మణి(Nara Brahmani) ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.
ట్విట్టర్ వేదికగా సోమవారం నారా బ్రాహ్మణి తీవ్రంగా స్పందించారు. ప్రధానంగా ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేయడం విశేషం.
Also Read : Tirumala : సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు