Nara Chandrababu Naidu: మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త !
మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త !
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శుభవార్త అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. 90 రోజుల పాటు 1,02,832 మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే బడ్జెట్ లో తల్లికి వందనం పథకం నిధులు కేటాయిస్తూ గుడ్ న్యూస్ అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మహిళలకు శుభవార్త అని చెప్పుకోవాలి.
Chandrababu Naidu Good News to Womens
టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా… ప్రతీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఇస్తాం అని చెప్పింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ నగదు ఇస్తాం అని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మేరకు మే నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నగదను జమ చేయనున్నారు.
అయితే తల్లికి వందనం పథకం అమలుచేయడంలో జాప్యం చేయడంపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో మీమ్స్ వేస్తూ ముఖ్యంగా పాలకొల్లు కూటమి అభ్యర్ధి, ప్రస్తుత జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఇంటి వద్ద పిల్లలను ఉద్దేశ్యించి అక్కడి మహిళలతో మాట్లాడిన మాటలను పదే పదే షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఆ వీడియోలో రామానాయుడి మాటలను పేరడీ చేస్తూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Also Read : Asha Workers: ఆశా కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు !