Nara Lokesh : తుని – పంటలు పండించే కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రభుత్వం ఆదుకోక పోతే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటి దాకా జగన్ పాలన దారుణంగా తయారైందని ఆరోపించారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని పట్టించుకోకుండా సీఎం పక్కన పెట్టేశారంటూ మండిపడ్డారు నారా లోకేష్.
Nara Lokesh Comment about Farmers
రెండో విడత యువగళం పాదయాత్ర సందర్బంగా తుని నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కౌలు రైతులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు నారా లోకేష్ తో. తమకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి రైతులు తీవ్రంగా నష్ట పోయారని దీనిని గుర్తించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వాపోయారు. కనీస మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు. తాము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
చాలా ప్రాంతాలలో పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించిన పాపాన పోలేదంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్(Nara Lokesh) . ఇకనైనా సీఎం తన పనితీరు మార్చు కోవాలని లేక పోతే ప్రజలు ఛీ కొట్టే రోజు దగ్గరలో వస్తుందని హెచ్చరించారు.
Also Read : Bhatti Vikramarka : మహాలక్ష్మి..చేయూతకు శ్రీకారం