Nara Lokesh: సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్‌ !

సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్‌ !

Nara Lokesh: సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్‌ ను మంత్రి నారా లోకేశ్‌ కాపాడారు. మంత్రి ఆదేశాలతో ఆయన్ను ఎడారి నుంచి స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్ల బాధ్యతను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం తీసుకుంది. ఈ క్రమంలో బాధితుడిని స్వస్థలమైన కోనసీమ జిల్లాలోని ఇసుకపూడికి తీసుకువస్తున్నారు. వీరేంద్ర శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సోదరి లక్ష్మితో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. తనను రక్షించిన మంత్రి లోకేశ్‌, తెలుగుదేశం ఎన్నారై విభాగానికి వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

Nara Lokesh Saved..

నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఇటీవల వీరేంద్రకుమార్‌ ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. ఖతర్‌ లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతక లేకపోతున్నానని చెప్పారు. వీరేంద్ర వీడియో చూసి స్పందించిన మంత్రి నారా లోకేశ్‌.. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం వీరేంద్రకుమార్ ను క్షేమంగా ఏపీకు చేర్చింది.

Also Read : Red Book: రెడ్‌ బుక్‌ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి నారా లోకేశ్‌ స్ట్రాంగ్ కౌంటర్ !

Leave A Reply

Your Email Id will not be published!