Nara Lokesh : నా వల్లే శ్రీసిటీలో ఫ్యాక్స్ కాన్ ఏర్పాటు
స్పష్టం చేసిన టీడీపీ జీఎస్ నారా లోకేష్
Nara Lokesh : విజనరీ లేని నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్బంగా బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను ప్రయత్నం చేసి శ్రీ సిటీకి ఫ్యాక్స్ కాన్ కంపెనీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నానని చెప్పారు.
ప్రస్తుతం వేలాది మందికి ఫ్యాక్స్ కాన్ కంపెనీ ఉపాధి కల్పిస్తోందని ఇదంతా తన చొరవ వల్లే జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని వారితో పంచుకున్నారు. ఈ మేరకు బస్సులో ఆనందంగా వెళుతున్న మహిళలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు నారా లోకేష్(Nara Lokesh). దీనిని ట్విట్టర్ వేదికగా ఇవాళ పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
ఫ్యాక్స్ కాన్ రూ. 12,700 కోట్ల పెట్టుబడితో తమ యూనిట్ ను ఏర్పాటు చేసిందని , 14 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. కాగా సీఎం జగన్ రెడ్డి టార్చర్ భరించ లేక సదరు కంపెనీ మరో యూనిట్ ను ఏర్పాటు చేయకుండా తెలంగాణను ఎంపిక చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. వారి దాడులు తట్టుకోలేక పోతోందని మండిపడ్డారు. త్వరలోనే తమ సర్కార్ వస్తుందని మరికొన్ని కంపెనీలను తీసుకు వస్తానని స్పష్టం చేశారు .
Also Read : Pawan Kalyan : జగన్ దౌర్జన్యం ఇకపై చెల్లదు
