Nara Lokesh : న్యూఢిల్లీ – అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో ఏ14గా చేర్చింది నారా లోకేష్ ను ఏపీ సీఐడీ. ఈ మేరకు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నారా లోకేష్ కు షాక్ ఇచ్చారు.
Nara Lokesh Comment
దీంతో ఏపీ సీఐడీ చేపట్టే విచారణకు హాజరు కావాలని, వారితో సహకరించాలని నారా లోకేష్ ను ఆదేశించింది హైకోర్టు. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది. ఆ వెంటనే నోటీసులతో ఢిల్లీకి బయలు దేరింది. విచిత్రం ఏమిటంటే ఆయన ఆచూకీ ఎక్కడా దొరడం లేదంటూ ప్రకటించింది ఏపీ సీఐడీ.
దీంతో తాను ఎక్కడికీ పారి పోలేదని, అందుబాటులో ఉన్నానని , తన తండ్రి ప్రస్తుతం జైలులో ఉన్నారని, లాయర్లతో మాట్లాడాల్సి రావడంతో ఢిల్లీలో ఉండాల్సి వచ్చిందన్నారు నారా లోకేష్(Nara Lokesh). తాను రెడీగా ఉన్నానని, ఏపీ సీఐడీ ప్రశ్నించే వాటికి సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో వర్చువల్ గా నంద్యాలలో జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు, మామ నందమూరి బాలకృష్ణలతో సంభాషించారు.
Also Read : Pawan Kalyan : ఎన్నికలకు సిద్దం కావాలి – పవన్