Nara Lokesh : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కండీషన్స్ తో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జడ్జి స్పష్టం చేశారు.
Nara Lokesh Serious Comments on CM YS Jagan
ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయడం, విమర్శలు గుప్పించడం, సభలలో పాల్గొనడం , ప్రచారం చేయడం ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 52 రోజులకు పైగా చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. ఈ మధ్య కాలంలో ఆయన భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు. మరో వైపు తనకు అనారోగ్యం ఉందంటూ ఆవేదన చెందారు.
అంతకు ముందు జరిగిన సభల్లో ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తీరా అరెస్ట్ చేశాక అనారోగ్యం గురించి ప్రస్తావించారు. ఇదంతా పక్కన పెడితే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) హైకోర్టు తీర్పుపై స్పందించారు. ఇప్పుడు ఇక యుద్దం మొదలైందంటూ కామెంట్ చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి.
Also Read : AAP Minister Atishi : కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఊరుకోం
