Nara Lokesh : జ‌నం న‌మ్మ‌కం కోల్పోయిన జ‌గ‌న్

నిప్పులు చెరిగిన నారా లోకేష్

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర 158వ రోజుకు చేరుకుంది. పాద‌యాత్ర‌లో భాగంగా చెరుకూరి వారి పాలెం క్యాంప్ సైట్ నుండి బుధ‌వారం ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా నారా లోకేష్(Nara Lokesh) కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. త‌న‌ను రెండు రోజుల పాటు కుటుంబ స‌భ్యుడిలా ఆద‌రించార‌ని, పేరు పేరునా ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు నారా లోకేష్.

Nara Lokesh Said

ప్ర‌త్యేకించి కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు స‌ర్వ‌దా రుణ‌ప‌డి ఉంటాన‌ని పేర్కొన్నారు. చెరువు కొమ్ము పాలెంలోని పొగాకు గోడౌన్ లో ప‌ని చేస్తున్న మ‌హిళా కూలీల‌ను క‌లిశారు. వారి ఇబ్బందుల‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువుకొమ్ముపాలెం, కె. అగ్ర‌హారం, ప‌రుచూరివారి పాలెం మీదుగా సాగిన పాద‌యాత్ర క‌నిగిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించింది.

పెద్ద ఎత్తున టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు , అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు నారా లోకేష్ కు. అనంత‌రం గంగ‌మ్మ దేవ‌త‌ను ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా కె. అగ్ర‌హారంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు నారా లోకేష్. జ‌నం న‌మ్మ‌కాన్ని వైఎస్ జ‌గ‌న్ కోల్పోయార‌ని, ఇక జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Also Read : Madhu Yashki : చిల్ల‌ర భాష మానుకో కేటీఆర్ – మ‌ధు యాష్కి

Leave A Reply

Your Email Id will not be published!