Nara Lokesh : గాడి తప్పిన పాలన జనం ఆవేదన
టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్
Nara Lokesh : ఏపీలో పాలన గాడి తప్పిందని జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువ గళం పాదయాత్రలో భాగంగా శనివారం నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామస్థులు లోకేష్ ను కలిశారు. సమస్యలను ఏకరువు పెట్టారు.
Nara Lokesh Speaks with People
చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, పిట్టలవారి పాలెం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని కోరారు. ఇది గనుక పూర్తయితే తమ గ్రామంలో తాగు, సాగు నీటి సమస్య తీరుతుందన్నారు. టీడీపీ పాలనలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణం జగన్ రెడ్డి వచ్చాక ఆగి పోయాయని వాపోయారు. గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరు వైపులా డ్రైనేజీ నిర్మించాలని సూచించారు.
చివరకు శ్మశానాన్ని సైతం కబ్జా చేశారంటూ ఆరోపించారు. దీనిపై నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. మీ సమస్యలకు పరిష్కారం కావాలంటే 9 నెలలు ఆగాలన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమని చెప్పారు. ఆ వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు .
ఏపీ సీఎం జగన్ రెడ్డికి అడ్డగోలు దోపిడీపై ఉన్నంత శ్రద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న సోయి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు నారా లోకేష్. ఇకనైనా జనం మారాలని లేక పోతే రాబోయే కాలంలో మరింత నరకం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : Madurai Train Mishap : మధురై రైలు భోగీల్లో అగ్ని ప్రమాదం