Nara Lokesh : పాలన అస్తవ్యస్తం రైతులు ఆగమాగం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
Nara Lokesh : తుని – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాజాగా ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోల్పోయారని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం నాటికి 218 రోజులకు చేరుకుంది. తుని నియోజకవర్గం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు.
Nara Lokesh Comment AP Govt
శృంగవృక్షంలో కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం అయ్యారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. రైతులు కోల్పోయిన పంటలను పరిశీలించారు నారా లోకేష్(Nara Lokesh). ఒంటిమామిడి తొండంగి, శృంగవృక్షం, వలస పాకల, టి. తిమ్మాపురం మీదుగా పాదయాత్ర కొనసాగింది. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆదరించడం ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత ఏమిటో అర్థం అవుతుందన్నారు.
ఈ యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ముందుండి సహకారం అందించారని స్పష్టం చేశారు నారా లోకేష్. రాబోయే ఎన్నికల్లో టీదీపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయని చెప్పారు.
Also Read : Telangana Ministers : మంత్రులకు ఛాంబర్స్ కేటాయింపు