Nara Lokesh : జగ‌న్ పాల‌న న‌ర‌క యాత‌న – లోకేష్

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షాకింగ్ కామెంట్స్

Nara Lokesh : ఏపీలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఏమిటి అనేది తేలుతుంద‌న్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ఆయ‌న పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. నారా లోకేష్ చేప‌ట్టిన పాద యాత్ర ఇవాల్టితో 123 రోజుల‌కు చేరుకుంది.

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో కొన‌సాగుతోంది. బద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న నారా లోకేష్(Nara Lokesh) ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఏపీలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల‌కు మాయ మాట‌లు చెప్పి మోసం చేసిన జ‌గ‌న్ కు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల భారం మోయ‌లేనిదిగా మారింద‌న్నారు. తాను ఇచ్చిన హామీల‌లో వంద శాతం అమ‌లు చేశాన‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు నారా లోకేష్.

ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం కేవ‌లం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తేనే అమ‌ల‌వుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం రౌడీలు, నేర‌గాళ్లు, ఆర్థిక దోపిడీదారులు, మోస‌గాళ్ల చేతుల్లో ప్ర‌భుత్వం కొన‌సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ వైపు ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇక నుంచి రాజా రెడ్డి రాజ్యం చెల్ల‌ద‌న్నారు. దానికి అంతం త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు ప‌లక‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు నారా లోకేష్.

Also Read : Arvind Kejriwal : మోదీ అభివృద్ది నిరోధ‌కుడు – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!