Nara Lokesh : మంగళగిరి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పాలిట శాఫంగా మారిందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బుధవారం ఆయన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా మైనార్టీ కుటుంబాలను పరామర్శించారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Nara Lokesh Slams AP CM YS Jagan
11 నెలల తర్వాత తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ది గురించి ప్రముఖులతో చర్చించానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.
మంగళగిరిలో ప్రధానంగా చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ పథకాలపై చర్చించడం జరిగిందన్నారు నారా లోకేష్(Nara Lokesh). అనంతరం పద్మశాలి బహుత్తమ సేవా సంఘం చీఫ్ చింతకంది కనకయ్యను కూడా కలుసుకున్నారు.
ఆరు నూరైనా సరే రాబోయే ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు నారా లోకేష్.
Also Read : Simhachalam : అప్పన్న ఘాట్ రోడ్డుకు రూ. 3 కోట్లు