Simhachalam : అప్ప‌న్న ఘాట్ రోడ్డుకు రూ. 3 కోట్లు

రూ. 84 ల‌క్ష‌ల‌తో సింహ‌గిరిపై తిరునామాలు

Simhachalam  : సింహాచ‌లం – శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సింహచలం దేవస్థానం(Simhachalam) ఈవో ఎస్.శ్రీనివాసమూర్తిని కోరారు పాల‌క మండ‌లి స‌భ్యుడు గంట్ల శ్రీ‌ను బాబు. బుధ‌వారం ఈవోను క‌లిశారు.

Simhachalam Upgradations

దేవస్థానంలో మూడు కోట్లతో చేపట్టనున్న ఘాట్ రోడ్ త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే సింహగిరిపై తక్షణమే తిరునామాలు ఏర్పాటు చేయాలని, వివిధ మార్గాల్లో స్వాగత ద్వారాలు, కళ్యాణ మండపాలు ప్రారంభోత్సం చేయాలని కోరారు.

దీనిపై ఈవో సానుకూలంగా స్పందించారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి దేవాదాయశాఖ అనుమతికి పంపించామని శ్రీను బాబుకు చెప్పారు. అక్కడ నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే జీఆర్ టి సహకారంతో రూ.84లక్షలతో త్వరలో తిరునామాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో వివరించారు.

కళ్యాణ మండపాల ప్రారంభం ,స్వాగత ద్వారాలు విలైనంత త్వరగా ఏర్పాటు చేయనున్నట్లు, పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామని ఈవో తెలిపారు. అంత‌కు ముందు గంట్ల శ్రీను బాబు అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేశారు. నిత్య కళ్యాణము లో పాల్గొన్నారు.

Also Read : CM Revanth Reddy : అభ‌య హ‌స్తం పేద‌ల నేస్తం

Leave A Reply

Your Email Id will not be published!