Nara Lokesh : ఏపీ సర్కార్ పై ఉమ్మడి యుద్ధం
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్
Nara Lokesh : రాజమహేంద్రవరం – ఏపీలో జగన్ అరాచక పాలన సాగుతోందని, జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ తో పాటు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల ప్రచార కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కీలకమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Nara Lokesh Comments on AP CM YS Jagan
అస్థిర ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చడమే తమ ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు లోకేష్(Nara Lokesh). మీటింగ్ ముగిసిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాలకీ సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసులుపెడుతున్నారని ఆరోపించారు. తన తండ్రికి ఎలాంటి ప్రమేయం లేక పోయినా స్కిల్ స్కాం కేసులో ఇరికించారని, అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తాము పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో తో ప్రజల్లో బలంగా వెళతామని స్పష్టం చేశారు. సంయుక్తంగా జనసేన , టీడీపీ ప్రచారం చేస్తాయని తెలిపారు నారా లోకేష్. 29వ తేదీ నుంచి జిల్లా స్థాయిలలో ఇరు పక్షాల నేతలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
Also Read : Pawan Kalyan : జగన్ పాలనపై దండయాత్ర
