Nara Lokesh : జ‌గ‌న్ పాల‌న‌లో జ‌నం గోస

నారా లోకేష్ ఎద్దేవా

Nara Lokesh : ఏపీలో కొలువు తీరిన వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న పూర్తిగా అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ఆరోపించారు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా ఆయ‌న వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ట్ట‌ణంలోని కొంద‌రు ఎస్సీ కాల‌నీకి చెందిన ప్ర‌జ‌లు నారా లోకేష్ ను క‌లుసుకున్నారు. త‌మ స‌మ‌స్య‌ల గురించి ఏక‌రువు పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారికి హామీ ఇచ్చారు. త‌మ ప్ర‌భుత్వం రాబోతోంద‌ని ఇక నిశ్చింతగా ఉండొచ్చ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల‌ను కావాల‌ని వైసీపీ స‌ర్కార్ నిలుపుద‌ల చేయ‌డం దారుణ‌మ‌న్నారు నారా లోకేష్. ఇది క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రొకటి కాద‌న్నారు. ఏదైనా ద‌మ్ము, ధైర్యం ఉంటే త‌మ‌తో ఎదుర్కోవాల‌ని కానీ పేద‌ల క‌డుపు కొట్టే ప్ర‌య‌త్నం చేస్తారా అంటూ ప్ర‌శ్నించారు.

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎస్సీల ఓట్లు త‌ప్ప వారి సంక్షేమం , స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వ‌ని ఎద్దేవా చేశారు. మ‌హాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించిన విజ్ఞాన మందిరాన్ని ఎలా కూల్చి వేస్తారంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్‌(Nara Lokesh). తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చాక కూల్చిన దానిని పున‌ర్ నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ కుప్ప కూలింద‌ని, ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆరోపించారు. ఇక‌నైనా సీఎం త‌న ప్ర‌చారాన్ని ప‌క్క‌న పెట్టి రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని సూచించారు నారా లోకేష్ బాబు.

Also Read : Koyil Alwar Tirumanjanam : కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!