Nara Lokesh : అనకాపల్లి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) షాకింగ్ కామెంట్స్ చేశారు. యువ గళం రెండో విడత పాదయాత్రలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు. ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు నారా లోకేష్.
Nara Lokesh Comment
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఇవాళ ప్రజలు , అన్ని వర్గాలకు చెందిన వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. తాను వచ్చాక ఉద్దరిస్తాడని అనుకుంటనే ఉన్న 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేశాడని ఆరోపించారు. దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు నారా లోకేష్.
అచ్యుతాపురంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ బాధితులతో ముఖాముఖి చేపట్టారు. ఈ సందర్బంగా లోకేష్ ను కలిశారు కొండకర్ల గ్రామస్తులు. తమకు న్యాయం చేమని కోరినా ఏపీ సీఎం పట్టించు కోలేదని వాపోయారు. ఈ సందర్బంగా వారికి హామీ ఇచ్చారు నారా లోకేష్. రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని చూస్తారని జోష్యం చెప్పారు.
Also Read : AP CM YS Jagan : ఎన్నికలకు సిద్దంగా ఉండాలి – జగన్