Nara Lokesh : జగన్ రాక్షస పాలన జనం ఆవేదన
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : కోనసీమ – ఏపీలో కొలువు తీరిన వైసీపీ జగన్ పాలన జనం పాలిట శాపంగా మారిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువ గళం రెండో విడత పాదయాత్ర కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో జరిగిన సభలో ప్రసంగించారు. 3 నెలల్లో వైసీపీ ఫ్యాన్ ఆగి పోవడం ఖాయమన్నారు. సైకో జగన్ కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు నారా లోకేష్.
Nara Lokesh Comments on AP CM YS Jagan
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం పెద్ద తప్పు అన్నారు. నిజం గెలిచి నిప్పులా బయటకు వచ్చారని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు . జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించేంత వరకు తాను నిద్ర పోనంటూ ప్రకటించారు.
ప్రజల రక్తం తాగుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్(Nara Lokesh). పేదలను ఏడిపించడం, పైశాచిక ఆనందం పొందడం అలవాటుగా మారిందన్నారు. ముమ్మడి వరంలో పేదలకు అన్నదానం చేస్తున్న అన్న క్యాంటీన్ ను మూసి వేసి దానిని వార్డు సచివాలయంగా మార్చారంటూ ధ్వజమెత్తారు.
నిరుపేదలు ఆకలితో ఉండ కూడదన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని కానీ ఓర్చుకోలేని జగన్ వాటిని రద్దు చేశారంటూ ధ్వజమెత్తారు.
Also Read : Rahul Dravid : హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్