Nara Lokesh: ఈ నెల 11 నుండి ‘శంఖారావం’ పేరుతో లోకేష్ ఎన్నికల ప్రచారం !

ఈ నెల 11 నుండి ‘శంఖారావం’ పేరుతో లోకేష్ ఎన్నికల ప్రచారం !

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ‘శంఖారావం’ పేరుతో ఈ నెల 11 నుంచి ఇచ్ఛాపురం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గురువారం విడుదల చేశారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో ఈ ‘శంఖారావం’ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసారు. ‘‘ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే ఈ ‘శంఖారావం’ లక్ష్యం. రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది. ఇచ్ఛాపురంలో ఈ నెల 11న తొలిసభ నిర్వహిస్తాం. జగన్‌ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.

Nara Lokesh New Program

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 9 గంటలకు శంఖారావం తొలిసభ జరుగుతుందన్నారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా ఈ శంఖారావం సాగుతుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Also Read : Kodi Katti Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ కు బెయిల్‌ !

Leave A Reply

Your Email Id will not be published!