Narayana Konakalla : వైసీపీ స‌ర్కార్ వేధిస్తోంది – నారాయ‌ణ‌

మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

Narayana Konakalla : అనంత‌పురం – వైసీపీ పాల‌న‌లో అక్ర‌మ అరెస్ట్ లు కొన‌సాగుతున్నాయ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌కు సంబంధించి రూ. 7 కోట్ల విలువ చేసే స్వంత భూమి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కోసం పోయింద‌న్నారు. నాపై వ‌చ్చిన‌వ‌న్నీ నిరాధార ఆరోప‌ణ‌లేన‌ని పేర్కొన్నారు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌.

Narayana Konakalla Comment on AP Govt

వైకాపా పాల‌న‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్న అన్ని వ‌ర్గాలు టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ రోజు రోజుకు బ‌లోపేతం అవుతుంటే జ‌గ‌న్ ఓర్వ లేక పోతున్నాడ‌ని ఆరోపించారు. అందుకనే త‌మ‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎన్ని అక్ర‌మ కేసులు పెట్టినా టీడీపీ శ్రేణులు భ‌య‌ప‌డ‌ర‌ని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత‌గా వేధింపుల‌కు గురి చేసినా చంద్ర‌బాబు నాయుడు ధైర్యం కోల్పోలేద‌న్నారు మాజీ మంత్రి కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌.

ఇదిలా ఉండ‌గా కొన‌క‌ళ్ల నారాయ‌ణ(Narayana Konakalla) చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి. మ‌రో వైపు ఏపీ సీఐడీ అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో మాజీ మంత్రితో పాటు ఏ14గా నారా చంద్ర‌బాబు నాయుడు కొడుకు నారా లోకేష్ బాబును కూడా చేర్చింది. ప్రస్తుతం సీఐడీ ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.

Also Read : AP CM YS Jagan : చంద్ర‌బాబు గ‌జ దొంగ – జ‌గ‌న్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!