Sidhu Special Diet : సిద్దూ మెనూ మామూలుగా లేదుగా

ఆరోగ్యం రీత్యా కోర్టు అనుమ‌తి

Sidhu Special Diet : ఏడాది జైలు శిక్ష అనుభ‌విస్తున్న కాంగ్రెస్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ మాజీ చీఫ్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ ఆరోగ్య రీత్యా ప్ర‌త్యేకంగా

మెనూ తీసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది కోర్టు. ఆయ‌న ఆరోగ్య రీత్యా తేలిక‌గా ఉండేలా ప్ర‌త్యేక ఆహారం(Special Diet) తీసుకోనున్నారు.

రాజ‌కీయ‌వేత్త‌గా మారిన క్రికెట‌ర్ కి కోర్టు అనుమ‌తించిన ఆహారంలో సాటెడ్ వెజ్జీలు, పెకాన్ గింజ‌లు, అవ‌కాడో , టోపు వంటివి ఉన్నాయి. సిద్దూ ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యులు నిర్దారించిన మేర‌కు మెనూను ఓకే చేసింది కోర్టు.

ఈ విష‌యాన్ని సిద్దూ స‌హాయ‌కులు సైతం ధ్రువీక‌రించారు. సిద్దూ(Sidhu Special Diet) రోజూ వారీగా ఏం తీసుకుంటారంటే. ప్ర‌తి రోజూ ఉద‌యం

రోజ్మేరీ టీ , వైట్ పెటా జ్యూస్ లేదా కొబ్బ‌రి నీళ్ల‌తో ప్రారంభం అవుతుంది.

అల్ప‌హారం కోసం ఒక క‌ప్పు లాక్టోస్ లేని పాలు ఇవ్వాలి. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడు, పుచ్చ కాయ లేదా చియా గింజ‌లు , ఐదు లేదా ఆరు బాదం, ఒక వాల్ న‌ట్ , రెండు పెకాన్ గింజ‌లు ఇవ్వాలని మెనూలో ఉంది.

మ‌ధ్యాహ్నం ఒక గ్లాసు బీట్ రూట్ లేదా గియా (బాటిల్ – పొట్ల‌కాయ‌) లేదా దోస కాయ లేదా మౌస‌మీ (తీపి నిమ్మ‌కాయ‌) లేదా తుల‌సి , పుదీనా ఆకులు లేదా ఉసిరి కాయ లేదా సెలెరీ ఆకులు లేదా తాజా హ‌ల్దీఈ (ప‌సుపు) లేదా క్యారెట్ లేదా క‌ల‌బంద ర‌సం తీసుకుంటారు.

ప్ర‌త్యామ్నాయంగా ఒక పండు – పుచ్చ కాయ , కివి, స్టాబెర్రీ, జామ‌, యాపిల్ లేదా చెక్క ఆపిల్ ఇస్తారు. మొల కెత్తిన బ్లాక్ చ‌నా (25 గ్రాములు) ,

ప‌చ్చి శెన‌గ ప‌ప్పు 25 గ్రాములు, ఖీర (దోస‌కాయ‌) ట‌మోటా, స‌గం నిమ్మ‌కాయ‌, అవ‌కాడో ఇవ్వాల్సి ఉంటుంది.

మ‌ధ్యాహ్నం భోజ‌నంలో 30 గ్రాముల జొన్న‌లు, నీరు చెస్ట్ న‌ట్ , రాగుల పిండి , స‌మాన ప‌రిమాణంలో ఒక చ‌పాతీ తీసుకుంటారు. సీజ‌న‌ల్

గ్రీన్ వెజిటేబుల్ , దోస‌కాయ‌, గియా రైతా లేదా ఒక గిన్నె బీట్ రూట్ రైటా ఒక్కో గిన్నె ఇస్తారు.

ఒక గ్రీన్ స‌లాడ్ గిన్నెలో దోస‌కాయ‌, టొమాటో, క‌క్రీ, పాల‌కూమ‌రు ఆకులు, సగం నిమ్మ‌కాయం, ఒక గ్లాసు ల‌స్సీ తీసుకుంటారు.

సాయంత్రం త‌క్కువ కొవ్వు పాలు, చ‌క్కెర లేని ఒక క‌ప్పు 100 ఎంఎల్ టీ, 25 గ్రాముల ప‌నీర్ స్లైస్ లేదా 25 గ్రాముల టోపుతో స‌గం నిమ్మ‌కాయ, రాత్రి భోజ‌నంలో మిక్స్ , వెజిటేబుల్ , డాల్ సూప్ , బ్లాక్ చనా సూప్ , 200 గ్రాముల గిన్నెతో న‌ల్ల మిరియాల పొడి. వేగిన కూర‌గాయలు (క్యారెట్ , బీన్స్ , బ్రోక‌లీ, మ‌ష్రూమ్ , బెల్ పెప్ప‌ర్ ) ఉంటాయి.

నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు అర గ్లాసు గోరు వెచ్చ‌ని నీటితో ఒక క‌ప్పు చ‌మోమిలే టీ , ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read : జ‌యహో సీఎం భ‌గ‌వంత్ మాన్

Leave A Reply

Your Email Id will not be published!