Nawaz Sharif : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వచ్చే నెల మే లో లండన్ నుంచి స్వదేశం పాకిస్తాన్ కు రానున్నారు.
రాజకీయ సంక్షోభం అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం వీగి పోయింది. దీంతో ప్రధాని పదవికి ఖాన్ గుడ్ బై చెప్పారు.
దీంతో పాక్ మాజీ దేశ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్(Nawaz Sharif) స్వయాన సోదరుడే ఇప్పుడు పాకిస్తాన్ కు నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు.
దీంతో నవాజ్ షరీఫ్ రాకకు అడ్డంకులు తొలగి పోయాయి. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొలువు తీరాక నవాజ్ షరీఫ్ 2019 నవంబర్ లో లండన్ కు వెళ్లారు.
మాజీ ప్రధానిని దుర్మార్గంగా తొలగించిన తర్వాత దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల సుడిగుండం మధయ పదవీచ్యుతడైన నవాజ్ షరీఫ్ వచ్చే
నెలలో ఈద్ రంజాన్ పండగ తర్వాత లండన్ నుంచి తిరిగి పాకిస్తాన్ కు తిరిగి వస్తారని పీఎంఎల్ – ఎన్ సీనియర్ నేత ఒకరు ధ్రువీకరించారు.
ఇదిలా ఉండగా పీఎంఎల్ -ఎన్ చీఫ్ గా ఉన్న నవాజ్ షరీఫ్ (Nawaz Sharif)మూడు సార్లు పాకిస్తాన్ కు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనపై లెక్కలేనన్ని అవినీతి, ఆరోపణలు ఉన్నాయి.
పనామా పత్రాల కేసులో 2017 జులైలో సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ ను పదవి నుంచి తొలగించింది.
ఆనాటి నుంచి 72 ఏళ్ల షరీఫ్ పై ఇమ్రాన్ ఖాన్ సర్కార్ అనేక అవినీతి కేసులు నమోదు చేయించింది.
తన చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు నాలుగు వారాల అనుమతి మంజూరు చేయడంతో నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లారు.
అంతే కాదు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైలులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ కు బెయిల్ కూడా లభిస్తుంది.
Also Read : విపక్ష నేతలు దొంగలు – ఇమ్రాన్ ఖాన్