Sharad Pawar : పవార్ రాజీనామా ప్యానల్ తిరస్కరణ
సంబురాలలో మునిగిన ఎన్సీపీ నేతలు
Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలన్న శరద్ పవార్(Sharad Pawar) నిర్ణయాన్ని పార్టీ ప్యానెల్ తిరస్కరించింది. కోర్ కమిటీ పార్టీ అధినేతగా కొనసాగాలని కోరుతూ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. శుక్రవారం శరద్ పవార్ చేసిన రాజీనామాపై పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆయన స్థాపించారని, పవార్ ఉన్నంత వరకు పార్టీకి నాయకత్వం వహించాలని కోరింది.
పవార్ ఆ పదవి నుంచి తప్పుకుంటానని బాంబు పేల్చారు. కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ రాజీనామా ఒప్పుకోవడం లేదని, ఈ మేరకు ప్యానెల్ కమిటీ తీర్మానం చేసిన విషయాన్ని ప్రకటించారు. దీంతో విషయం తెలిసిన వెంటనే మరాఠా అంతటా ఎన్సీపీ ఆధ్వర్యంలో సంబురాలు మిన్నంటాయి.
ఎన్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని పవార్ తన కోరికను వ్యక్తం చేశారు. రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నాం. పార్టీ చీఫ్ గా కొనసాగాలని అభ్యర్థించాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు ప్రపుల్ పటేల్.
గత కొద్ది రోజులుగా దేశంలోని పలువురు అగ్ర నేతలు పవార్(Sharad Pawar), సుప్రియా సూలేతో పాటు తనను కూడా సంప్రదించారని పేర్కొన్నారు. తమ మనోభావాలను వ్యక్తం చేశారని తెలిపారు. జిల్లా నుండి వచ్చిన క్యాడర్ మనో భావాలను తాము తెలుసుకున్నామని, అంతా వైదొలగకూడదని కోరారని చెప్పారు పటేల్.
Also Read : సీమాంతర ఉగ్రవాదం ప్రమాదం – జైశంకర్
