Ajit Pawar : డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక
Ajit Pawar : మరాఠాలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఊహించని రీతిలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ బిగ్ షాక్ ఇచ్చారు. తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్ భవన్ కు బయలు దేరారు. అక్కడ గవర్నర్ ను కలుసుకున్నారు. ఆపై మరాఠాలో కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే , బీజేపీ సంకీర్ణ సర్కార్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఆ వెంటనే వెను వెంటనే ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజిత్ పవార్(Ajit Pawar) మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. ఆ మేరకు ఆదివారం రాజ్ భవన్ లో డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఇదే సమయంలో అజిత్ పవార్ వర్గానికి చెందిన పలువురికి కేబినెట్ లో చోటు కల్పించనున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో ఊహించని రీతిలో రాజకీయంగా బిగ్ ట్విస్ట్ చేసుకోవడం ఒకింత ఆసక్తిని రేపింది. మరో వైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్, 30 మంది ఎమ్మెల్యేల గురించి ఇప్పటి దాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు . ఇదిలా ఉండగా మొత్తం ఎన్సీపీలో 53 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్నారు. వీరిలో 43 మంది అజిత్ పవార్ కు బహిరంగంగా మద్దతు పలకడం విశేషం. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది.
Also Read : Khammam CP : కాంగ్రెస్ నేతల మాటలు అబద్దం