Neerabh Kumar Prasad: సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం పొడిగింపు !

సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం పొడిగింపు !

Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సీఎస్‌గా నీరభ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలతో సీఎస్ పదవీ కాలం పూర్తవడంతో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Neerabh Kumar Prasad Service..

1987 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ను ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగిన సీఎస్ జవహార్ రెడ్డిని జీఏడీకు రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేస్తూ ఆయన స్థానంలో నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించింది. గతంలో ఈయన రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Also Read : AP Secretariat: ఏపీ సచివాలయంలో ఐదు రోజులే పనిదినాలు !

Leave A Reply

Your Email Id will not be published!