PM Modi : రైల్వేలపై గత పాలకుల నిర్లక్ష్యం
నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వార్థ రాజకీయాలు రైల్వేల ఆధునీకరణను కప్పి వేస్తాయని ఆరోపించారు. హై రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ భూ భాగంలో ప్రపంచంలోనే మొట్ట మొదటి సెమీ హై స్పీడ్ ప్యాసింజర్ రైలు అయిన అజ్మీర్ – ఢిల్లీ కాంట్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి(PM Modi) జెండా ఊపి ప్రారంభించారు.
2014 తర్వాతే విప్లవాత్మక పరివర్తన ప్రారంభమైందని నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీఎం ప్రసంగించారు. స్వాతంత్ర అనంతరం , రైల్వేల ఆధునీకరణలో రాజకీయ ప్రయోజనాలే ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయని అన్నారు.
దురదృష్టవశాత్తూ స్వార్థ పూరిత , నీచ రాజకీయాలు ఎల్లప్పుడూ రైల్వేల ఆధునీకరణణు కప్పి వేశాయన్నారు. పెద్ద ఎత్తున అవినీతిని రైల్వేలో అభివృద్దిని జరగనివ్వ లేదన్నారు. రైల్వే ఎంపిక ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండనీయ లేదన్నారు ప్రధానమంత్రి(PM Modi).
రాజకీయ ప్రయోజనాలను చూసి రైల్వే మంత్రి ఎవరు అవుతారో నిర్ణయించారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అసలు ఎప్పటికీ నడవని రైళ్లు ప్రకటించబడ్డాయన్నారు మోదీ. పేదల భూమిని లాక్కొని వారికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. రైల్వే భద్రత, పరిశుభ్రత అన్నీ విస్మరించారని మండిపడ్డారు.
Also Read : ప్రయోగాలకు బీజేపీ పెద్దపీట – సీటీ రవి