Nepal Bowler Pushpa : త‌గ్గేదే లేదంటున్న నేపాల్ బౌల‌ర్

ఫోటో, వీడియో నెట్టింట్లో వైర‌ల్

Nepal Bowler Pushpa : క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మందాన , స‌మంత క‌లిసి న‌టించిన పుష్ప మూవీ దేశాన్ని, ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది.

ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన డైలాగులు, మేన‌రిజం, పాట‌లు క్రీడా లోకాన్ని విస్తు పోయేలా చేసింది. ప‌లువురు పురుష క్రికెట‌ర్లు త‌గ్గేదే లే అంటూ దుమ్ము రేపారు. త‌మ మీమ్స్ తో ఆక‌ట్టుకున్నారు.

తాజాగా ఈ పుష్ప మేనియా మ‌హిళా క్రికెట్ కు పాకింది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌త్యేకంగా పోస్ట్ చేసింది.

ఒకే ఒక్క యాక్ష‌న్ తో నేపాల్ కు చెందిన బౌల‌ర్ పాపుల‌ర్ అయి పోయారు. పుష్ప మూవీ గురించి ఇప్ప‌టికే పాపుల‌ర్ గా మారిందంటూ క్యాప్ష‌న్ కూడా జ‌త చేసింది ఐసీసీ. ఫెయిర్ బ్రేక్ ఇన్విటేష‌న‌ల్ టోర్న‌మెంట్ అనేది ఒక వినూత్న‌మైన మ‌హిళ‌ల క్రికెట్ టోర్న‌మెంట్.

నేపాల్ క్రికెట‌ర్ సీతా ఆర‌ణా మ‌గ‌ర్ ప్ర‌సిద్ద పుష్ప మూవీలోని త‌గ్గేదేలేతో అల‌రించారు. ఆమె వికెట్ తీసిన ఆనందంలో దీనిని పంచుకున్నారు. 2022లో ర‌వీంద్ర జ‌డేజా, ఒడెడ్ మెక్ కాయ్ పుష్ప డైలాగ్ తో ఇర‌గ‌దీశారు.

సోష‌ల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారారు. ఈనెల 5న టోర్న‌డోస్ మ‌హిళ‌లు, నీల‌మ‌ణి మ‌హిళ‌ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. నేపాల్ కు చెందిన సీతా రాణా మ‌గ‌ర్ త‌న చేతిని గ‌డ్డం కింద క‌దుపుతూ సూప‌ర్ హిట్ చిత్రం పుష్ప‌లో అల్లు అర్జున్ స్టైల్ ను అనుక‌రించింది వికెట్ తీసిన ఆనందంలో.

 

Also Read : బీజేపీ యువ మోర్చా స‌భ‌కు ‘ద్ర‌విడ్’

Leave A Reply

Your Email Id will not be published!