Charles Sobhraj : సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ రిలీజ్
వరుస హత్యలతో హడలెత్తించిన కిల్లర్
Charles Sobhraj : నేపాల్ లో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ గా పేరొందిన చార్లెస్ శోభరాజ్(Charles Sobhraj) కు ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రధానంగా బికినీ కిల్లర్ గా పేరొందాడు. హత్యలు చేయడంలో ఎక్స్ పర్ట్ గా పేరొందాడు.
2003 నుంచి జైలులో బందీగా ఉన్నాడు. తాను తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని వెంటనే విడుదల చేయాలని కోర్టుకు విన్నవించాడు ఛార్లెస్ శోభరాజ్. 15 రోజుల్లో స్వదేశానికి పంపించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. చెరసాలలో సత్ ప్రవర్తన కలిగి ఉంటే రిలీజ్ చేసేందుకు అక్కడి కోర్టు పర్మిషన్ ఇస్తుంది.
సీనియర్ సిటిజన్లకు ఉన్న మినహాయింపులు తనకు కూడా వర్తింప చేయాలని కోరాడు కోర్టును ఛార్లెస్ శోభరాజ్(Charles Sobhraj) . విచిత్రం ఏమిటంటే శోభరాజ్ తండ్రి ఇండియాకు చెందిన వారు. తల్లి వియత్నాంకు చెందినది. నేర ప్రవృత్తి చిన్నప్పటి నుంచే ప్రారంభమైంది. ఫ్రాన్స్ లో పెరిగాడు ఛార్లెస్ శోభరాజ్.
1970లో బ్యాంకాకు వెళ్లాడు. అక్కడ టూరిస్టులను టార్గెట్ చేసేవాడు. ఎక్కువగా బికినీలు ధరించిన వారిపై ఫోకస్ పెట్టేవాడు. వారిని ఎలాగో పరిచయం పెంచు కోవడం, మత్తు మందులు ఇచ్చి లోబర్చు కోవడం, ఆపై దారుణంగా హత్య చేయడం పనిగా పెట్టుకున్నాడు. ఇదే సమయంలో 1976లో మనోడు దొరికాడు.
భారత్ లో అరెస్ట్ అయ్యాడు తీహార్ జైలులో గార్డులకు స్వీట్లు ఇచ్చాడు..అందులో మత్తు మందిచ్చి పరార్ అయ్యాడు. మళ్లీ అరెస్ట్ కావడం, 197లో పారిస్ కు వెళ్లడం, అక్కడ మర్డర్లు చేయడం చేశాడు. చివరకు నేపాల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జైలులో బందీగా ఉన్నాడు.
Also Read : పీసీబీ చీఫ్ రమీజ్ ఔట్ సేథికి ఛాన్స్