India Nepal Meet : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్బాతో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్ – నేపాల్ దేశాల (India Nepal Meet)మధ్య ఉన్న స్నేహ పూర్వక సంబంధాలు చాలా ప్రత్యేకమైన్నారు మోదీ. ఇలాంటి స్నేహం ఇంకెక్కాడా లోకంలో కనిపించదని కితాబు ఇచ్చారు.
నేపాలి అభివృద్ధి ప్రయాణంలో భారత దేశం తోడ్పాటు అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. భారత పర్యటనలో ఉన్న నేపాల్ పీఎం భేటీ అనంతరం వీరిద్దరూ కీలక ప్రకటన చేశారు.
నేపాల్ హైడ్రో పవర్ అభివృద్ది ప్రణాళికల్లో భారత కంపెనీలు భాగం కానున్నట్లు మోదీ వెల్లడించారు. దీనిపై తామిద్దరం ఒక అంగీకారానికి, ఒప్పందానికి వచ్చామని తెలిపారు.
నేపాల్ హైడ్రో పవర్ సెక్టార్ లో భారత కంపెనీలు కీలకం కానున్నట్లు స్పష్టం చేశారు మోదీ. భవిష్యత్తులో సహకారం పొందేందుకు, అంది పుచ్చుకునేందుకు రెండు దేశాలు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా అంతర్జాతీయ సౌర కూటమిలో నేపాల్ కూడా చేరడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు ప్రధాన మంత్రి. ఇదిలా ఉండగా నేపాల్ లో రూపే కార్డు సేవలను ఇరువురు కలిసి ప్రారంభించారు.
భారత్, నేపాల్ దేశాల మధ్య ప్రధాన అంశాలపై చర్చకు వచ్చాయి.
Also Read : కన్నడ నాట కాంగ్రెస్ దే జెండా