Mallikarjun Kharge : ఏనాడూ పోటీ చేస్తానని అనుకోలేదు – ఖర్గే
ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బావుండేది
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న ఎంపీ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఏనాడూ బరిలో ఉంటానని అనుకోలేదన్నాడు. సోమవారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న అసమ్మతి నాయకుడిగా పేరొందిన ఎంపీ శశి థరూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బహిరంగ చర్చకు సిద్దం కావాలంటూ సవాల్ విసరడాన్ని తప్పు పట్టారు. పార్టీలో అంతర్గత పోటీ ఇది. ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని నా ఉద్దేశం. పార్టీ అంటేనే భిన్న అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారని ప్రతి ఒక్కరి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునేందుకు పార్టీ దోహదం చేస్తుందన్నారు.
తనకు ఎంపీ శశి థరూర్ మంచి స్నేహితుడని పేర్కొన్నారు ఖర్గే. అయితే బహిరంగ ఎన్నికల కంటే ఏకాభిప్రాయంతో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ పదవి కంటే ముందు దేశంలో విద్వేషాలను, అల్లర్లను సృష్టిస్తూ వస్తున్న బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్నదే తమ ముందున్న ప్రధాన ప్రశ్న అన్నారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).
నామినేషన్ ప్రక్రియ తర్వాత మల్లికార్జున్ ఖర్గే తనతో మాట్లాడిన మాట వాస్తవమేనన్నారు. ప్రధానంగా పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ప్రధాన నిర్ణయాలన్నీ కేవలం హైకమాండ్ మాత్రమే తీసుకుంటోందని ధ్వజమెత్తారు.
అయితే పార్టీ ఎప్పటి లాగే ఉండాలని అనుకుంటే మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకోవాలని సంస్కరణలు, మార్పులు కావాలని అనుకుంటే తనను ఎన్ను కోవాలని శశి థరూర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆయన విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
Also Read : 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు – ఈసీ