PM Modi : కొత్త ఎయిర్ బేస్ దేశ భ‌ద్ర‌త‌కు కీల‌కం – మోదీ

భార‌త్ పాకిస్తాన్ స‌రిహ‌ద్దు పై ప్ర‌ధాన మంత్రి

PM Modi : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ – పాకిస్తాన్ దేశాల స‌రిహ‌ద్దుల్లో కొత్త ఎయిర్ బేస్ భ‌ద్ర‌త‌కు అత్యంత కీల‌క‌మ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఒక‌ప్పుడు పావురాలు వ‌దిలే వార‌ని ఇప్పుడు చిరుత‌ల‌ను వ‌దిలే స్తా ఉంద‌న్నారు మోదీ. బుధ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  దీసాలో కొత్త ఎయిర్ బేస్ కు శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ లోని గాంధీ న‌గ‌ర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022ను ప్రారంభించారు. కొత్త ఎయిర్ బేస్ దేశ భ‌ద్ర‌త‌కు స‌మ‌ర్థ‌వంతమైన కేంద్రంగా ఆవిర్భ‌విస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు మోదీ. గుజ‌రాత్ భార‌త‌దేశంలో ర‌క్ష‌ణ కేంద్రంగా మారుతుంద‌ని చెప్పారు.

దేశ భ‌ద్ర‌త‌లో కీల‌క పాత్ర పోషించ‌నుంద‌న్నారు. కొత్త ఎయిర్ ఫీల్డ్ నిర్మాణంపై దీసా ప్ర‌జ‌లు అత్యంత ఉత్సాహ భ‌రితంగా ఉన్నార‌ని చెప్పారు. దానిని నేను తెర‌పై చూశాన‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి(PM Modi) . ఈ ఎయిర్ ఫీల్డ్ ఇక నుంచి ప్ర‌ధాన భూమిక‌ను పోషించ‌నుంద‌న్నారు.

దీసా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు కేవ‌లం 130 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. మ‌న బ‌ల‌గాలు ప్ర‌ధానంగా వైమానిక ద‌ళం కూడా కీల‌కంగా మారనుంద‌న్నారు. పాశ్చాత్య దేశాల నుండి వ‌చ్చే ఏ ముప్పుకైనా ఎదుర్కొనేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు మోదీ. ఆ సత్తా భార‌త దేశానికి ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి.

Also Read : స్టార్ లింక్ లైసెన్స్ కోసం ‘మ‌స్క్’ ద‌ర‌ఖాస్తు

Leave A Reply

Your Email Id will not be published!