Punjab Cabinet : పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్ పాలనలో తనదైన ముద్ర కనబరుస్తున్నారు. పార్టీకి సంబంధించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో తాను జోక్యం కల్పించుకోనంటూ ఇప్పటికే ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేసినట్లు సమాచారం.
ఈనెల 19న శనివారం ఉదయం 11 గంటలకు పంజాబ్ విధానసభలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం (Punjab Cabinet )చేయనున్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 117 సీట్లకు గాను 92 సీట్లలో విజయ దుందుభి మోగించింది ఆప్.
సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన ఫోటో కానీ ప్రధాని మోదీ ఫోటో కాని ఉండేందుకు వీలు లేదన్నాడు. వాటి స్థానంలో భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలు పెట్టాలని ఆదేశించాడు.
122 మంది ఎమ్మెల్యేల సెక్యూరిటీ తొలగించాడు. ఇక ఎవరు లంచం అడిగినా తనకు ఫోన్ చేయాలని ప్రకటించాడు మాన్. ఇక పంజాబ్ ఆప్ కేబినెట్ లో కొలువు తీరేది ఎవరనే ఉత్కంఠకు తెర దించారు పంజాబ్ సీఎం(Punjab Cabinet ).
రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారిలో ప్రధానంగా వీరి పేర్లు తెర మీదకు వచ్చాయి. హర్నాల్ సింగ్ చీమా, అమన్ అరోరా, కుల్తార్ సంధ్వన్ , సరవ్ జిత్ కౌర్ మనుకే, గుర్మీత్ సింగ్ మీత్ హయర్, బల్దిందర్ కౌర్ ఉన్నారు.
వీరంతా గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక మొదటిసారి తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారిలో కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ , జీవన్ జోత్ కౌర్ , డాక్టర్ చరణ్ జిత్ ల పేర్లు ఉన్నాయి.
Also Read : మరాఠాలో మళ్లీ మాదే అధికారం