Akhilesh Yadav BJP : బీజేపీ ఓటమే తమ లక్ష్యం – అఖిలేష్
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
Akhilesh Yadav BJP : సమాజ్ వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుపై ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి చర్చించారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము కాంగ్రెస్ పార్టీతో జత కట్టే ప్రసక్తి లేదన్నారు. తాము త్వరలో ఒడిశా సీఎం బిజూ పట్నాయక్ కూడా సమావేశమవుతామని చెప్పారు. తమ అంతిమ లక్ష్యం ఒక్కటేనని అది భారతీయ జనతా పార్టీని ఓడించడమే మిగిలి ఉందన్నారు.
తమ ప్రధాన ఎజెండా ఇదేనని స్పష్టం చేశారు అఖిలేష్ యాదవ్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపాదిత ప్రతిపక్ష ఫ్రంట్ ఫార్ములా ఏమిటి అని అడిగిన మీడియా ప్రశ్నకు దీనికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇది బయటకు చెప్పే విషయం కాదన్నారు ఎస్పీ చీఫ్. కేంద్రం తనకు అధికారం ఉందనే ధీమాతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వస్తోందని ఆరోపించారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav BJP). దీనిని తాము ఖండిస్తున్నామన్నారు.
వాళ్లకు వ్యాక్సిన్ అనేది ఒక బలంగా మారిందన్నారు. ఎవరు ఏది చేసినా అది తమ వల్లనే జరిగిందనే ప్రచారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పడం ఖాయమన్నారు అఖిలేష్ యాదవ్ . వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని కొందరి చేతుల్లోకి నెట్టేలా ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన పాత్ర ఏ రకంగా ఉండాలో ఒకసారి ఆలోచించాలని సూచించారు ఎస్పీ చీఫ్.
Also Read : ప్రజాస్వామ్యంలో రాహుల్ కు స్థానం లేదు